SRH vs RCB: ఉప్పల్‌లో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరు

SRH vs RCB: ఉప్పల్‌లో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరు

ఐపీఎల్ లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆతిధ్య  సన్ రైజర్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. సన్ రైజర్స్ ఆడిన 7 మ్యాచ్ ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు ఆర్సీబీ ఆడిన 8 మ్యాచ్ ల్లో ఒకటే మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఈ టోర్నీలో ఒక మ్యాచ్ జరిగితే సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది.  

Also Read: విరాట్‌కు నచ్చేశాడు: కమ్మిన్స్‌పై కోహ్లీ ప్రశంసలు