RCB vs PBKS: బోణీపై బెంగళూరు గురి.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఆర్సీబీ

RCB vs PBKS: బోణీపై బెంగళూరు గురి.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఆర్సీబీ

ఐపీఎల్ లో భాగంగా నేడు ఆసక్తి సమరానికి రంగం సిద్ధమైంది. డుప్లెసిస్ సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిధ్యమివ్వనున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఇప్పటికే ఇరు జట్లు లీగ్ లో తమ తొలి మ్యాచ్ ఆడేశాయి. చెన్నైతో జరిగిన సీజన్ తొలి మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోగా.. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఇరు జట్లు ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేయలేదు.

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

ఫాఫ్ డు ప్లెసిస్సికెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్(వికెట్ కీపర్), అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్