RCB vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు.. మ్యాక్స్ వెల్‌కు నో ఛాన్స్

RCB vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు.. మ్యాక్స్ వెల్‌కు నో ఛాన్స్

ఐపీఎల్ లో నేడు (ఏప్రిల్ 15) బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఆర్సీబీ ఆరు మ్యాచ్ లాడితే ఒక మ్యాచ్ లోనే విజయం సాధించింది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు విజయాలు సాధించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్ ), విల్ జాక్స్, రజత్ పటీదార్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, విజయ్‌కుమార్ వైషాక్, రీస్ టోప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్