
ఐపీఎల్ 2025లో మరో మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం (మే 17)రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ భారీ వర్షం కారణంగా జరగలేదు. టాస్ వేయకముందు నుంచే చినుకులు పడుతూనే ఉన్నాయి. వర్షం తగ్గితే మ్యాచ్ సార్ట్ చేద్దామని ఉన్నా.. వరుణుడు అవకాశం ఇవ్వలేదు. కట్ ఆఫ్ టైం దాటిపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఫలితం తేలకపోవడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో ఆర్సీబీ 17 పాయింట్లతో టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లడమే కాకుండా.. ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. మరోవైపు కోల్‌కతా 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఆర్సీబీ మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 23 న సన్ రైజర్స్ హైదరాబాద్‌తో.. మే 27 న లక్నో సూపర్ జయింట్స్‌తో తలపడనుంది. మరోవైపు కేకేఆర్ తమ చివరి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన ఈ రెండు జట్లకు ఇది నామమాత్రపు మ్యాచే.
►ALSO READ | IND vs ENG: టీమిండియాపై ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఇంగ్లాండ్ జట్టులో చేరిన దిగ్గజ పేసర్