సింగర్ బాలు కోసం సాయంత్రం 6 గంటలకు ‘యూనివర్సల్ మాస్ ప్రేయర్’

సింగర్ బాలు కోసం సాయంత్రం 6 గంటలకు ‘యూనివర్సల్ మాస్ ప్రేయర్’

గాయకుడు, గానగంధర్వుడు ఎస్సీ బాలసుబ్రమణ్యం కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బాలుకు ఆగష్టు 5న కరోనా నిర్ధారణ అయింది. అంతకుమందు ఆయనకు కరోనా లక్షణాలు లేకపోవడంతో ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. కానీ, ఆ తర్వాత లక్షణాలు బయటపడటంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థనలు చేస్తున్నారు.

బాలసుబ్రమణ్యం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ సినీ మ్యూజియన్స్ యూనియన్ తరపున  ‘యూనివర్సల్ మాస్ ప్రేయర్’ కు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న బాలు అభిమానులు ఎక్కడున్నా, ఏం పని చేస్తున్నా సరే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సామూహిక ప్రార్థనలు చేయాల్సిందిగా ఆయన కోరారు. దానికి సంబంధించిన వీడియోను పీఆర్వో వంశీ శేఖర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

ఇప్పటికే బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని కోరుతూ.. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, ఖష్బూ తదితరులు ట్వీట్లు చేశారు.

రోజు రోజుకి బాలసుబ్రమణ్యం ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో.. ఈ రోజు ఆయనకు వెంటిలేటర్ ను తొలగించారు. ప్రస్తుతం ఆయన స్వతహాగా ఊపిరి తీసుకుంటున్నారు.

For More News..

మళ్లీ ఆస్పత్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ట్రంప్ ఒక రాంగ్ ప్రెసిడెంట్

ఆన్‌లైన్ వేదికగా నేషనల్ స్పోర్ట్స్ డే