ప్రాణాలకు తెగించి.. ప్రయాణికురాలిని కాపాడిన మహిళా కానిస్టేబుల్

ప్రాణాలకు తెగించి.. ప్రయాణికురాలిని కాపాడిన మహిళా కానిస్టేబుల్

వరంగల్  రైల్వే స్టేషన్లో రైలు నుంచి పడబోయిన ప్రయాణికురాలిని ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి  కాపాడింది.  ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

భద్రాచలం మణుగూరు ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ కు వస్తుండగా వరంగల్  రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారమ్ పై  రైలు పూర్తిగా ఆగకుండానే  ప్రయాణికురాలు తన లగేజిని పట్టుకుని దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె రైలు నుంచి ప్లాట్ ఫారమ్ పై పడిపోయింది. దీంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న  ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ సొనాలి మరోటి మెలాక్ పరుగెత్తి ఆమెను పైకి లేపి  ప్రాణాలు కాపాడింది.  దీంతో అక్కడే ఉన్న ప్రయాణికులు ఆ కానిస్టేబుల్ పై ప్రశంసలు కురిపించారు.   ఈవిషయం తెలుసుకున్న ఆర్పీఎఫ్ అధికారులు సొనాలిని అభినందించారు.