అమెరికాలో ఎన్టీఆర్కు క్రేజ్ మాములుగా లేదు

అమెరికాలో  ఎన్టీఆర్కు క్రేజ్ మాములుగా లేదు

జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ దేశంలోనే కాదు..విదేశాల్లోనూ ఏ మాత్రం తగ్గలేదు. RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. స్వదేశంలోనే కాదు..అమెరికాలోనూ జూ.ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. లాస్ ఏంజిల్స్ లోని చైనీస్ థియేటర్ లో సందడి చేసిన తారక్ కు ఫ్యాన్స్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. పెద్ద పెద్ద హోర్డింగ్స్, ఎల్ ఈడీ ట్రక్కులు ఏర్పాటుచేసి ఆనందం వ్యక్తం చేశారు. 

 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’ లో ఆర్ఆర్ఆర్ సినిమా రెండు కేటగిరీల్లో నామినేట్ అయింది. బెస్ట్ పిక్చర్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట నామినేట్ అయ్యాయి. బుధవారం 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్  జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు డైరెక్టర్ రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ అమెరికా వెళ్లారు.