
ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు బడా స్టార్స్‌తో రాజమౌళి లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ రూపొందిస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా అందరిచూపు ‘ఆర్ఆర్ఆర్’ మూవీపైనే ఉంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేసిన జక్కన్న, ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు. ఆల్రెడీ ఎన్టీఆర్, రామ్‌చరణ్ క్యారెక్టర్ టీజర్స్‌తో పాటు దోస్తీ అనే పాటను రిలీజ్ చేసిన టీమ్, గ్లింప్స్ పేరుతో మరో టీజర్ విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు దీన్ని విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఎలాంటి ఆడియో లేకుండా 45 సెకెన్స్ ఉండే ఈ వీడియోలో మూవీ మెయిన్ కాన్సెప్ట్‌ని చూపించబోతున్నారట. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్‌తో చేతులు కలిపారు. దీంతో ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్స్ అన్నీ పీవీఆర్ థియేటర్స్‌లోనే జరగనున్నాయి. సినిమా రిలీజ్ వరకూ పీవీఆర్ కూడా పీవీఆర్ఆర్ఆర్‌గా పిలవబడుతుంది. లోగో కూడా మార్చేశారు. ఓ సినిమా కోసం మల్టీప్లెక్స్ సంస్థ పేరు మార్చుకోవడం వరల్డ్‌లో ఇదే ఫస్ట్‌టైమ్. అల్లూరిగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆలియాభట్, అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.