పంజాబ్ సీఎం కీలక ప్రకటన .. ఆ రైతు కుటుంబానికి రూ.కోటీ, ప్రభుత్వ ఉద్యోగం

పంజాబ్ సీఎం కీలక ప్రకటన .. ఆ రైతు కుటుంబానికి రూ.కోటీ, ప్రభుత్వ ఉద్యోగం

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కీలక ప్రకటన చేశారు.  క‌న్నౌరి బోర్డర్ వద్ద జ‌రిగిన కాల్పుల్లో మృతిచెందిన రైతు శుభ్‌క‌ర‌ణ్ సింగ్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం, అతని సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.  బటిండాకు చెందిన శుభ్‌క‌ర‌ణ్ సింగ్ (21) అనే యువ రైతు బుధవారం పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖనౌరీ సరిహద్దు పాయింట్ వద్ద పోలీసులతో జరిగిన ఘర్షణల్లో మరణించాడు.  శుభ్‌క‌ర‌ణ్ మృతికి కార‌ణ‌మైన పోలీసుపై చ‌ర్యలు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. రైతులకు పంజాబ్ ప్రభుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు.  

శుభకరన్ సింగ్ రబ్బరు బుల్లెట్ తగిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పాటియాలా రేంజ్ డిఐజీ తెలిపారు.  ఖనౌరీ, శంభు సరిహద్దు క్రాసింగ్ వద్ద హర్యానా పోలీసులు రైతుల మార్చ్ అడ్డుకునేందుకు భాష్ప వాయువు షెల్స్ ప్రయోగించడంతో మొత్తం 26 మంది రైతులు గాయాపడ్డారని పంజాబ్ అధికారులు తెలిపారు.   

యువ రైతు మరణించడంతో రైతులు ఢిల్లీ ఛలో మార్చ ను రెండు రోజుల పాటువాయిదా వేశారు. తదుపరి కార్యచరణపై చర్చించేందుకు రైతులు సమావేశం కానున్నారు. పంటలకు  ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతులపై కేసుల ఎత్తివేత, ఇతర డిమాండ్లతో రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్ కు ఎస్ కేఎమ్, కిసాన్ మజ్దూర్ సంఘ్ నాయకత్వం వహిస్తున్నాయి.  

Also Read :పాకిస్థానీతో ప్రేమాయణం.. ఇస్లాం మతాన్ని స్వీకరించిన భారత యువతి