లాక్ డౌన్ సాయంగా లాయర్లకు రూ.10 వేలు

లాక్ డౌన్ సాయంగా లాయర్లకు రూ.10 వేలు

14,188 మంది లాయర్లకు రూ.10 వేలు
రూ. 15 కోట్లు విడుదల
అకౌంట్లలో జమ చేసిన చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్‌ వల్ల కోర్టులు పనిచేయక ఆర్థికంగా సమస్యలతో సతమతమవుతున్న లాయర్ల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు జమయ్యాయి. ప్రభుత్వం రూ.25 కోట్లు ప్రకటించగా అందులో తొలి విడత రూ.15 కోట్లను విడుదల చేసింది. న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్‌ ద్వారా 14,188 మంది లాయర్లకు రూ.10 వేలు చొప్పున 1,029 మంది అడ్వొకేట్‌ గుమాస్తాలకు రూ. 5 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి.

సికింద్రాబాద్ లోని జ్యుడిషియల్‌ అకాడమీలో గురువారం జరిగిన కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ ఆ మొత్తాలను ఆన్ లైన్‌ పద్ధతుల్లో వాళ్ల ఖాతాల్లో జమ చేశారు. టెక్నికల్‌ రీజన్స్ తో 2 వేల అప్లికేషన్లకు జమ కాలేదని, వీటికి కూడా నగదు జమ చేస్తామని ట్రస్ట్‌ చైర్మన్‌ అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లి పేరుతో యువ‌కుడికి వ‌ల‌.. రూ.65 ల‌క్ష‌లు నొక్కేసి..

ఇవాళ కొండపోచమ్మ సాగర్‌‌‌‌కు నీళ్లు