
న్యూఢిల్లీ: ఇండియాలో బొమ్మల తయారీని పెంచేందుకు కేంద్రం కొత్త స్కీమ్‌ను తీసుకురానుంది. ప్రొడక్షన్ ఆధారంగా రూ.13,100 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఈ పథకానికి సంబంధించిన వివరాలను సిద్ధం చేసి, త్వరలో కేంద్ర మంత్రివర్గానికి ఆమోదం కోసం పంపనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఈ
పథకం ప్రకారం, బొమ్మల తయారీదారులకు అమ్మకాలు, టర్నోవర్ ఆధారంగా నేరుగా ప్రోత్సాహకాలు ఇస్తారు. దీంతో పాటు బొమ్మల తయారీకి అవసరమైన భాగాల దిగుమతి చేసుకుంటే, వీటిపై చెల్లించే కస్టమ్స్ డ్యూటీలో కొంత భాగాన్ని రిఫండ్ చేస్తారు. ఈ రూ.13,100 కోట్ల పథకం ఆమోదం పొందితే, ఇండియాలో బొమ్మల రంగం పుంజుకోవడానికి వీలుకుదురుతుంది. ఈ ఇండస్ట్రీకి మద్ధతిచ్చేందుకు దిగుమతి సుంకాల పెంపు, నాణ్యత నియంత్రణ చర్యలు, టాయ్ క్లస్టర్స్ ఏర్పాటు వంటి చర్యలను ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది.