నర్సరీ ఖాళీ చేసేందుకు బీఆర్ఎస్ లీడర్ రూ. కోటిన్నర డీల్

నర్సరీ ఖాళీ చేసేందుకు బీఆర్ఎస్ లీడర్ రూ. కోటిన్నర డీల్

ఘట్ కేసర్, వెలుగు: సర్కార్ నర్సరీని ఖాళీ చేసేందుకు బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ రియల్టర్ తో  రూ. కోటిన్నర డీల్ కుదుర్చుకున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘట్ కేసర్ మున్సిపల్ పరిధిలోని  ప్రైమ్ ల్యాండ్ వెంచర్ సర్వే నంబర్127(బి)లోని1.39 ఎకరాల పార్కు స్థలంలో  ప్రభుత్వ నర్సరీ ని ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. ఆ భూమిని తాను 2019లో కొనుగోలు చేశానని నర్సరీని తొలగించాలని మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, కమిషనర్ సాబేర్ అలీని ఘట్ కేసర్ కు చెందిన కందకట్ల మాధవరెడ్డి కలిసి విజ్ఞప్తి చేశాడు. 

నర్సరీని  ఖాళీ చేసేందుకు రూ. 1.5 కోట్ల డీల్  కుదుర్చుకున్నారు. దీంతో నర్సరీ తొలగించారు. డీల్ డబ్బుల చెల్లింపులో మాధవరెడ్డి నిర్లక్ష్యం చేస్తుండగా..  అతనిపై చైర్ పర్సన్ భర్త జంగయ్య యాదవ్ ఒత్తిడి పెంచాడు.  దీంతో మళ్లీ నర్సరీ ఏర్పాటు చేయగా..  మాధవరెడ్డి  డీల్ కు సంబంధించి  ఫోన్ లో మాట్లాడిన ఆడియోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా శుక్రవారం వైరల్ గా మారింది.