
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసిందని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజురా సత్యం, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దొనికేని దయానంద్, నిమ్మల రమేశ్ తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు శుక్రవారం పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కృషితో రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో ఖానాపూర్ పట్టణంలోని 12 వార్డుల్లో మురికి కాలువలు, సీసీ రోడ్లు, పట్టణంలోని అంతర్గత రోడ్ల రిపేర్లు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం పటాకులు కాల్చి సంబురాలు చేసుకు న్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజిద్, మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ రాజేందర్, సంతోష్ , ఆత్మ చైర్మన్ సత్యం, మాజీ కౌన్సిలర్లు శంకర్, సురేశ్, అమనుల్లా ఖాన్, షబ్బీర్ పాషా, శ్రీనివాస్, కిశోర్, నాయకులు జహీర్, షౌకత్ పాషా, శంకర్ తదితరులు పాల్గొన్నారు.