
హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ పేరుతో ఎనిమిదేళ్లుగా ప్రజల నుంచి రూ.15 లక్షల కోట్లను ప్రధాని మోదీ దోచుకున్నారని, ఇప్పుడు బిహార్ ఎన్నికల కోసం స్లాబులు తగ్గించి పండుగ చేసుకోవాలనడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు.
కరీంనగర్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ దంపతులు ఒంటెల రోహిత్ రెడ్డి, గోగుల గౌతమి రెడ్డి బుధవారం తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ ప్రజలు మరోసారి చైతన్యవంతమైన తీర్పు ఇవ్వాలని కోరారు.