ఎంఎస్‌‌‌‌ఎంఈలకు సపోర్ట్‌‌‌‌గా రూ.2 లక్షల కోట్లతో ప్యాకేజీ !

ఎంఎస్‌‌‌‌ఎంఈలకు సపోర్ట్‌‌‌‌గా రూ.2 లక్షల కోట్లతో ప్యాకేజీ !
  • కొవిడ్ టైమ్‌‌‌‌లో ఈసీఎల్‌‌‌‌జీఎస్‌‌‌‌ తెచ్చినట్టే  కొత్త స్కీమ్‌‌‌‌పై పనిచేస్తున్న ప్రభుత్వం
  • యుద్ధం వలన నష్టపోతున్న చిన్న వ్యాపారాలకు కొలేటరల్ లేని లోన్లు

న్యూఢిల్లీ: ఇరాన్‌‌‌‌–అమెరికా యుద్ధం వలన నష్టపోతున్న  స్మాల్‌‌‌‌, మైక్రో, మీడియం ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ (ఎంఎస్‌‌‌‌ఎంఈలు) కు మద్దతిచ్చేందుకు కేంద్రం రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీని సిద్ధం చేస్తోంది.  కొవిడ్‌ టైమ్‌‌‌‌లో తెచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్‌‌‌‌ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్‌‌‌‌జీఎస్‌‌‌‌)  మాదిరిగానే కొత్త స్కీమ్‌ను   తీసుకురానుంది. ఈ స్కీమ్ కింద ప్రభుత్వ హామీతో లోన్లు పొందొచ్చు. పశ్చిమాసియాలో యుద్ధం వలన నష్టపోతున్న రంగాలకు ఉపశమనం కల్పించడమే దీని టార్గెట్‌‌‌‌.  వచ్చే 15 రోజుల్లో దీనిని ప్రకటించే అవకాశం ఉంది. గ్లోబల్‌‌‌‌ ట్రేడ్‌‌‌‌ అంతరాయాల వల్ల ఎగుమతి ఆధారిత రంగాలు ఒత్తిడిలో ఉన్నాయని సంబంధిత వ్యక్తులు తెలిపారు. 

ఎంఎస్‌‌‌‌ఎంఈలు  వడ్డీ రేట్లకు సున్నితంగా స్పందిస్తాయని, కాబట్టి లిక్విడిటీ సపోర్ట్‌‌‌‌ కీలకమని అన్నారు.  ప్రస్తుతం వ్యవస్థలో  ఒత్తిడి తీవ్రంగా లేకపోయినా, పరిస్థితి మరింత దిగజారితే ముందస్తు జాగ్రత్తగా ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని వివరించారు.  గ్లోబల్‌‌‌‌గా అనిశ్చితి కొనసాగుతుండటంతో, ఉద్రిక్తతలు తగ్గినా తిరిగి సాధారణ స్థాయికి చేరడానికి  సమయం పడుతుందని అన్నారు.  ఈసీఎల్‌‌‌‌జీఎస్‌‌‌‌  స్కీమ్‌‌‌‌  వలన లక్షలాది ఎంఎస్‌‌‌‌ఎంఈలు లాభపడ్డాయి.  కొత్త పథకం కూడా అదే విధంగా ప్రస్తుత ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతుందని అంచనా.