తమిళనాడులో మరో ప్రమాదం జరిగింది. షూటింగ్ సెట్‌లో మంటలు చెలరేగి దాదాపు రూ.20 లక్షల నష్టం వచ్చింది. వేలాయుధం కాలనీలోని పారామౌంట్ స్టూడియో ఉంది. అక్కడ సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్‌లను నిర్వహిస్తుంటారు. దాని కోసం అవసరమైన ఇళ్లు, భవనం వంటి సెట్స్‌ను పర్మినెంట్‌గా ఏర్పాటు చేశారు. స్టూడియో వెనుక భాగంలో ఉన్న సినిమా సెట్‌కు సంబంధించిన వస్తువుల నుంచి వచ్చిన పొగ…అది కాస్తా పెద్దదై మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన విషయాన్ని గమనించిన వాచ్‌మన్ వెంటనే ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించాడు.
రెండు అగ్నిమాపక దళాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. దాదాపు రెండు గంటల పాటు అక్కడి వస్తువులు అగ్నిలో కాలిపోయాయి. సినిమా కోసం వేసిన సెట్, సామగ్రి కాలిపోయినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.

