చాలా సింపుల్ : రూ.2 వేల నోటు తీసుకెళ్లామా.. చిల్లర తెచ్చుకున్నామా.. అంతే

చాలా సింపుల్ : రూ.2 వేల నోటు తీసుకెళ్లామా.. చిల్లర తెచ్చుకున్నామా.. అంతే

రూ. 2 వేల నోట్లను  ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19 శుక్రవారం రోజున భారత రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది.  త‌మ వ‌ద్ద ఉన్న రూ. 2వేల నోట్లను మార్చుకోవడానికి  మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజలకు సమయాన్ని ఇచ్చింది. దీనికి  సంబంధించిన నియమాలను బ్యాంకులకు సూచించింది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ,HDFC వంటి బ్యాంకులు రూ. 2 వేలను మార్చుకోవడానికి పెద్దగా రూల్స్ ఏం విధించలేదు.  రూ. 2 వేల నోట్ల మార్పిడికి ఆధార్ కార్డ్ లాంటి ఐడెంటిటీ ఫ్రూవ్స్, బ్యాంకుల్లో ఎలాంటి ఫారమ్‌ను నింపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. అంటే చాలా సింపుల్ గా రూ.2 వేల నోట్లను తీసుకెళ్లి  చిల్లర తెచ్చుకోవచ్చు అన్నమాట. 

మరోవైపు 2018 లోనే భారత రిజర్వ్ బ్యాంకు  రూ.2వేలనోట్ల ముద్రణను నిలిపివేసింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.2  నోట్లలో 89 శాతం మార్చి 2017కి ముందు ముద్రించినవే. ప్రస్తుతం దేశంలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి