స్థానిక సంస్థలకు ప్రతి నెలా రూ.227 కోట్ల నిధులు

 స్థానిక సంస్థలకు ప్రతి నెలా రూ.227 కోట్ల నిధులు

హైదరాబాద్: 2021-22 సంవత్సరానికి గాను ప్రతినెలా రూ. 227 కోట్ల గ్రాంటును క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. వీటిలో గ్రామ పంచాయతీలకు రూ.210.44 కోట్లు, మండల పరిషత్లకు  రూ.11.37 కోట్లు, జిల్లా పరిషత్లకు  రూ.5.69 కోట్లు విడుదల చేస్తామని  మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా రూ.682 కోట్లు అందాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రెండో విడత నిధులు ఇప్పటి వరకు చెల్లించక పోయినా.. రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి నెలా నిధులు విడుదల చేస్తోందన్నారు. ఫిబ్రవరికి సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.

 

మరిన్ని వార్తల కోసం..

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళలు వెన్నెముక‌

ఆశా వర్కర్ల సేవలు అమోఘం