పెట్రోల్​పై రూ.3 తగ్గించిన తమిళ సర్కార్

పెట్రోల్​పై రూ.3 తగ్గించిన తమిళ సర్కార్

చెన్నై: పెరుగుతున్న పెట్రో ధరల నుంచి తమిళనాడు ప్రజలకు ఉపశమనం దొరికింది. పెట్రోల్‌‌పై పన్నులను అక్కడి ప్రభుత్వం తగ్గించింది. దీంతో పెట్రోల్ లీటరు రేటు రూ.3 తగ్గింది. ఈ నిర్ణయంతో  రాష్ట్ర ఖజానాపై ఏడాదికి రూ.1,160 కోట్లు భారం పడనుందని ఆర్థిక శాఖ  తెలిపింది. మే నుంచి రేట్ల పెంపు కారణంగా అన్ని మెట్రో సిటీల్లో పెట్రో ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, తమిళనాడు, కేరళ, బీహార్,  పంజాబ్‌‌తో సహా పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటాయి. చెన్నైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ. 102.49, డీజిల్ లీటరుకు రూ.94.39 ఉంది. గత ఏప్రిల్ నుంచి ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.63.59 నుంచి  రూ.101.84 వరకు పెరిగింది. డీజిల్ ధర లీటరుకు రూ.62.29 నుంచి రూ .89.87కి పెరిగింది.