సింగరేణి మూతపడకుండా కాకా కాపాడిండు : వివేక్ వెంకటస్వామి

సింగరేణి మూతపడకుండా  కాకా కాపాడిండు  : వివేక్ వెంకటస్వామి

1995లో సింగరేణి మూతపడే సమయంలో ఎన్టీపీసీ నుంచి రూ. 400 కోట్ల రుణం ఇప్పించి కాకా వెంకటస్వామి సింగరేణిని కాపాడారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు  వివేక్ వెంకటస్వామి చెప్పారు. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ సరిగ్గా అమలు కావటం లేదన్న ఆయన.. సింగరేణి నిధులను ఆ ప్రాంతానికి కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు కేటాయిస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచుతామని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. సింగరేణిని బీజేపీ ప్రైవేట్ పరం చేయదని, మరింత అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని చెప్పారు.