బెల్లంపల్లి, వెలుగు: ఆటోలో అక్రమంగా మద్యం బాటిళ్లు తరలిస్తుండగా ఆదివారం భీమిని ఎస్సై పట్టుకున్నారు. భీమిని నుంచి టేకులపల్లి గ్రామానికి ఆటోరిక్షాలో మద్యం బాటిళ్లను తరలిస్తుండగా ఎస్సై విజయ్‌కుమార్ తన సిబ్బందితో పట్టుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.40 వేలు ఉంటుందని ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా మద్యం తరలిస్తున్న కొమ్ము రాజు, మానేపల్లి వంశీ అనే ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు తెలిపారు.
