6 సైబర్ నేరాల్లో రూ.5.82 లక్షలు కొట్టేసిన్రు

6 సైబర్ నేరాల్లో రూ.5.82 లక్షలు కొట్టేసిన్రు

హైదరాబాద్‌‌, వెలుగు : గ్రేటర్‌‌లో సైబర్ క్రిమినల్స్ ఆరుగురిని ట్రాప్ చేసి రూ.5 లక్షలు 82 వేలు కాజేశారు. సైదాబాద్ కి చెందిన అయూబ్ అన్సారీకి బ్లూడార్ట్ నుంచి రావాల్సిన కొరియర్ అందకపోవడంతో కస్టమర్ కేర్ కోసం గూగుల్ లో సెర్చ్ చేశాడు. ఫేక్ అని తెలియక ఓ నంబర్ కి కాల్ చేశాడు. సైబర్ క్రిమినల్ కాల్ రిసీవ్ చేసుకుని గూగుల్ పేకి మనీ రిక్వెస్ట్ పంపి ప్రొసీడ్ టు పే చేస్తే కొరియర్ లొకేషన్ డిస్పాచ్ డీటెయిల్స్ తెలుస్తాయని నమ్మించాడు. అలా రూ.లక్షా 80 వేలు కొట్టేశాడు. మరో కేసులో నాప్‌‌టాల్‌ టెలీ షాపింగ్ లో రూ.12 లక్షల విలువైన కారు గిఫ్ట్ వ‌చ్చిందంటూ సైదాబాద్ కి చెందిన వెంకటేశ్ కి ఆదివారం సైబర్ క్రిమినల్ కాల్స్ చేశాడు. రిజిస్ట్రేషన్‌ , ప్రాసెసింగ్ ‌‌ఫీజులు, ట్రాన్స్ పోర్ట్ చార్జీల పేరుతో మొత్తం 80 వేలు వసూలు చేశాడు.

ఓఎల్ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ లో వెహికల్స్ అమ్మకానికి పెట్టి బేగంపేటకి చెందిన అమీర్ ఇస్లామ్, మధును ట్రాప్ చేసి రూ.2.01లక్షలు, వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన కార్తీక్ కు అతడి కంపెనీ బాస్ పేరుతో ఫిషింగ్ మెయిల్ పంపి రూ.81 వేలు, కలర్స్ ఎంటర్ టైన్ మెంట్ పోర్ట‌ల్ లో సెర్చ్ చేసి అంబర్ పేటకి చెందిన సౌరవ్ వద్ద రూ.40 వేలు కాజేశారు. ఈ ఆరుగురు బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

రాష్ట్రంలో కరోనా కేసులు 5,000 దాటినయ్