రాజ్యాంగ స్పూర్తితో పారదర్శక పాలన : పవన్

రాజ్యాంగ స్పూర్తితో పారదర్శక పాలన : పవన్

అధికారంలోకి వస్తే రైతులు, యువకులు, మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్. సామన్యలకు కూడా రాజకీయాలను దగ్గర చేసేందుకే పార్టీ పనిచేస్తుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో పవన్ మాట్లాడారు. 58 ఏళ్లు నిండిన మత్స్యకారులకు రూ.5వేల పెన్షన్ ఇస్తామన్నారు. చేపలవేటకు వెళ్లలేని రోజు వారికి రూ.500 అందజేస్తామన్నారు. లక్షమంది యువ రైతులను తయారు చేస్తామన్నారు. చీర-సారె కింద రూ.10వేలు అందజేస్తామన్నారు. కొత్తగా ఆటో కొనుగోలు చేసిన వారికి రూ.50వేలు అందజేస్తామన్నారు.

అంతేకాదు సామజిక ఆర్ధికంగా మేలు చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. రాజ్యాంగ స్పూర్తితోనే ఆదర్శంగా తీసుకుని పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.