బడ్జెట్‌లో వైద్యరంగానికి భారీ కేటాయింపులు

బడ్జెట్‌లో వైద్యరంగానికి భారీ కేటాయింపులు

పీఎం ఆత్మనిర్భర్ స్వస్థ్ యోజన

హెల్త్ కేర్ కోసం రూ. 2,23,846 కోట్లు

ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఈసారి బడ్జెట్‌ను డిజిటల్‌గా ప్రవేశపెట్టారు. బండెడు బడ్జెట్ పుస్తకాలకు బదులుగా.. అంతా ఆన్ లైన్‌లోనే.. అదికూడా ఒక యాప్‌లోనే రిలీజ్ చేశారు. దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిర్మలకు ఇది వరుసగా మూడోసారి కాగా.. మోడీ ప్రభుత్వానికి తొమ్మిదో బడ్జెట్ కావడం విశేషం. కరోనా వల్ల దేశ ఎకానమీ మొత్తం గాడితప్పింది. కరోనా తర్వాత వస్తున్న బడ్జెట్ కావడంతో దేశం యావత్తు బడ్జెట్ మీద ఆశలు పెట్టుకుంది.

ఈసారి బడ్జెట్‌లో వైద్య రంగానికి పెద్దపీఠ వేశారు. కరోనాతో దేశం మొత్తం అతలాకుతలం అయింది. దాంతో వైద్యరంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హెల్త్ కేర్ కోసం రూ. 2,23,846 కోట్లు కేటాయించారు. పీఎం ఆత్మనిర్భర్ స్వస్థ్ యోజన పథకానికి రూ. 64, 180 కోట్లను కేటాయించారు. కరోనా వ్యాక్సిన్ కోసం 35 వేల కోట్లు కేటాయించారు. అర్బన్ స్వచ్ఛ్ భారత్ మిషన్ కోసం రూ. 1,41,678 కోట్లు కేటాయించారు.