హీరో విజయ్ ఇంట్లో 10 బ్యాగుల డబ్బులు స్వాధీనం

V6 Velugu Posted on Feb 06, 2020

హీరో విజయ్ ఇంట్లో బుధవారం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలలో ఐటీ అధికారులకు ఊహించని విధంగా 10 బ్యాగుల డబ్బులు దొరికాయి. ఐటీ అధికారులు హీరో విజయ్‌కి చెందిన ఇళ్లు, బిగిల్ సినిమా నిర్మాణ సంస్థ ఏజీఎస్ కార్యాలయాలతో పాటు.. ఆ సినిమా ఫైనాన్షియర్ అన్బుచెలియన్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. బుధవారం నుంచి జరుగుతున్న ఐటీ దాడులు.. ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. హీరో విజయ్ ఇంట్లో ఐటీ అధికారులు దాదాపు రూ. 65 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విలువైన బంగారంతో పాటు పెద్ద మొత్తంలో నగదు లభించినట్లు తెలుస్తోంది. ఇదంతా లెక్కతేలలేదని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం హీరో విజయ్ ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఆయనను ఐటీ అధికారులు అక్కడే విచారించారు. విజయ్ హీరోగా నటించిన బిగిల్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా 250 నుంచి 300 కోట్ల వరకు వసూల్ చేసిందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా కోసం విజయ్ రూ. 50 కోట్లు పారితోషికంగా తీసుకున్నారట. దాదాపు తొమ్మిది గంటలుగా హీరో విజయ్‌ను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

For More News..

లాటరీలో రూ. 7 కోట్లు గెలుచుకున్న చిన్నారి

తల్లిని, చెల్లిని రోకలిబండతో కొట్టి చంపిన యువకుడు

Tagged chennai, Actor Vijay, Hero Vijay, IT raids, kollywood, thalapathy vijay, Bigil movie, IT raids in hero vijay home

Latest Videos

Subscribe Now

More News