- పోలీసులకు ఫిర్యాదు చేసిన సభ్యులు
జూబ్లీహిల్స్ , వెలుగు: తెలుగు సినిమా డిజిటల్ వెబ్ సిరీస్ డ్రైవర్స్ యూనియన్లో భారీ ఆర్థిక అక్రమాలు జరిగినట్లు బంజారాహిల్స్ పీఎస్లో కేసు నమోదైంది. యూనియన్ ప్రెసిడెంట్ సీతారాం, సెక్రటరీ మహబూబ్ బేగ్, ట్రెజరర్ వెంకటేశ్ కలిసి సుమారు రూ. 70 లక్షల మేర సభ్యుల నిధులను మిస్ యూజ్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
సభ్యులకు తెలియకుండానే వారి పేర్లపై ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి, ఆ డబ్బును మళ్లీ డ్రా చేశారని పేర్కొన్నారు. అచ్చంపేటలో తక్కువ ధరకు భూములు కొని ఎక్కువ రేటు చూపించి మోసం చేశారని యూనియన్ సభ్యుడు సుర్ల రమేశ్, మరికొందరు యూనియన్ సభ్యులు ఫిర్యాదులో చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
