ఏపీకి 7 వేల కోట్ల సాయం: వరల్డ్ బ్యాంకు

ఏపీకి 7 వేల కోట్ల సాయం: వరల్డ్ బ్యాంకు

అమరావతి ప్రాజెక్టుకు లోన్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేసిన వరల్డ్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పింది. వైద్యం, వ్యవసాయం,  ఇంధనం, డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యక్రమాలకు దాదాపు 7 వేల కోట్ల రూపాయల సాయం అందిస్తామని ప్రకటించింది.  గతనెల ఏపీ గవర్నమెంట్ తో చేసుకున్న ఒప్పందం మేరకు హెల్త్ సెక్టార్ కు 2,500 కోట్ల రూపాయల సాయం కూడా ఇందులో ఉన్నట్లు తెలిపింది. ఏపీలో కొత్త సర్కారు అభివృద్ధి ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ నెల 15న ఏపీ రాజధానికి 2 వేల కోట్ల ఆర్థిక సాయం ప్రతిపాదనను వరల్డ్ బ్యాంకు తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నందున తమ డైరెక్టర్ల బోర్డు ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అమరావతికి వరల్డ్ బ్యాంకు సాయం నిరాకరించిందని కొన్నిరోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి.