
రోజురోజుకూ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతోంది. గాలిలో కంటికి కనిపించని ఎన్నో మలినాలు చేరుతున్నాయి. అందుకే గాలిని ఫిల్టర్ చేసేందుకు ఇలాంటి ప్యూరిఫైయర్స్‌ని వాడితే కాస్తయినా కాలుష్యం నుంచి దూరంగా ఉండొచ్చు.
ముఖ్యంగా కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంటున్నవాళ్లకు ఇది బాగా పనికొస్తుంది. దీన్ని కే7 అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇది పీఎం2.5తోపాటు దుమ్ము, పొగ, అలెర్జీ కారకాలు, బ్యాక్టీరియా లాంటి వాటిని గాలి నుంచి చాలావరకు తొలగిస్తుంది. కాంపాక్ట్ సైజులో ఉంటుంది. మెడలో వేసుకుని ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఇది 300mAh బ్యాటరీతో వస్తుంది. దీన్ని యూఎస్‌బీతో రీచార్జ్ చేసుకోవచ్చు. అల్ట్రా–సైలెంట్ టెక్నాలజీతో తయరుచేయడం వల్ల దీని నుంచి చాలా తక్కువ సౌండ్ వస్తుంది. పని చేస్తున్నప్పుడు, నిద్ర పోతున్నప్పుడు, జర్నీలో ఉన్నప్పుడు.. ఇలా ఎక్కడైనా దీన్ని వాడుకోవచ్చు.
ధర: 3400