- ఎమ్మెల్సీగా వచ్చే ఫండ్‌ను నిజామాబాద్కోసం ఖర్చు చేస్త
- టీపీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్
నిజామాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీఎఫ్) కోసం ప్రభుత్వం రూ.800 కోట్ల బడ్జెట్కేటాయించిందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్తెలిపారు. ప్రతి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకి రూ.5 కోట్ల సీడీఎఫ్లభిస్తుందని, ఆ రకంగా తనకు వచ్చే ఫండ్మొత్తాన్ని నిజామాబాద్నగరాభివృద్ధికి ఖర్చు చేస్తానన్నారు. శనివారం నిజామాబాద్మున్సిపల్కార్పొరేషన్వార్షిక బడ్జెట్మీటింగ్లో ఎక్స్అఫీషియో సభ్యుడి హోదాలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత పదేండ్లు పాలించిన బీఆర్ఎస్రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పులు పెట్టిపోయిందన్నారు.
కాంగ్రెస్ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ప్రయారిటీ అంశాలకు నిధులు వెచ్చిస్తోందన్నారు. ఉత్తర తెలంగాణలో పెద్ద నగరమైన నిజామాబాద్కోసం ఎన్ని నిధులైనా ఇవ్వడానికైనా సీఎం రేవంత్‌రెడ్డి రెడీగా ఉన్నారని తెలిపారు. పట్టణ మాస్టర్ప్లాన్అమలుకు సన్నద్ధం కావాలని అధికారులకు సూచించారు.
రూ.247 కోట్ల బడ్జెట్ ఆమోదం
నిజామాబాద్మున్సిపల్ కార్పొరేషన్లో 2026–27కు గాను రూ.247 కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించారు. అంచనా వేసిన మొత్తం రూ.247 కోట్ల ఆదాయానికి సమానంగా ఖర్చును ఆమోదించారు. మేయర్ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ మీటింగ్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ఎమ్మెల్యే ధన్‌పాల్‌సూర్యనారాయణ, మున్సిపల్కమిషనర్దిలీప్కుమార్తదితరులు ఉన్నారు.
