ఎస్సీ, బీసీలకు 85 వేల కోట్లు.. ఎస్టీలకు 53 వేల కోట్లు

ఎస్సీ, బీసీలకు 85 వేల కోట్లు.. ఎస్టీలకు 53 వేల కోట్లు

ఎస్టీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె ఆయా వర్గాల కేటాయింపులను వివరించారు. ఎస్సీలు, ఓబీసీల సంక్షేమం కోసం రూ.85 వేల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. అలాగే ఎస్టీల సంక్షేమం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.53 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించామని తెలిపారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.9500 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.