
హైదరాబాద్, వెలుగు: దసరా, దీపావళి సందర్భంగా తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చినట్టు ఆర్ఎస్ బ్రదర్స్ ప్రకటించింది. ఈ సేల్ సందర్భంగా షాపింగ్ చేసేవాళ్లు 2.5 కిలోల బంగారాన్ని, 80 కేజీల వెండిని, 150 శామ్సంగ్ టీవీలను, 600 వెట్గ్రైండర్లను, 1,375 ఎలక్ట్రిక్ కుకర్ల వంటి ఎన్నో బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంటుంది. గోల్డ్ బంపర్ డ్రాల ఫలితాలను 5.10.22న, 26.10.22 తేదీలలో ప్రకటిస్తారు. విజేతలకు 25 బంగారు వడ్డాణాలు, 50 కేజీల వెండిపాత్రలను ఇస్తారు. అంతేగాక మూడుశాతం తరుగుతో బంగారు నగలు, మజూరీ లేని వెండి నగలు అందుబాటులో ఉన్నాయని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ డైరెక్టర్ కేశవ్ గుప్తా చెప్పారు. ఎస్ఐబీ కార్డులతో కొంటే ఐదుశాతం క్యాష్‌బ్యాక్ కూడా వస్తుందని చెప్పారు. అయితే కనీసం రూ.నాలుగు వేల విలువైన వస్తువులు కొనాలి.