జీతాలు, ఫించన్లకు నిధుల్లేవ్..కానీ కొత్త సెక్రటేరియట్ కోసం వందల కోట్లు ఖర్చు

జీతాలు, ఫించన్లకు నిధుల్లేవ్..కానీ కొత్త సెక్రటేరియట్ కోసం వందల కోట్లు ఖర్చు

నిధులు లేకపోయినా కానీ..తెలంగాణ ప్రభుత్వం గొప్పలకు ఏమీ తక్కువ కాదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో జీతాలు, పింఛన్ల ఇచ్చేందుకు తగినన్ని నిధులు లేకపోయినా..తెలంగాణ ప్రభుత్వం మాత్రం కొత్త సెక్రటేరియట్ లో అధునాతన సౌకర్యాల కోసం వందల కోట్లు వెచ్చిస్తోందని ఆరోపించారు. రూ. 1200 కోట్ల ప్రజాధనంతో నిర్మిస్తున్న నూతన సచివాలయంలో నిర్మించిన డైనింగ్ టేబుల్ గది ఫోటోను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ లో షేర్ చేశారు. కొత్త సెక్రటేరియట్ లోని డైనింగ్ గది ఫోటోతో పాటు..ఫలక్ నుమా ప్యాలెస్ లోని నిజాం నిర్మించిన డైనింగ్ గది ఫోటోను పోస్ట్ చేశారు. 

రెండు డైనింగ్ టేబుల్స్ కథ అంటూ రెండు ఫోటోలను షేర్ చేశారు. అంతేకాకుండా తెలంగాణలో జీతాలు, పింఛన్లు చెల్లించేందుకు తగినన్ని నిధులు లేకపోయినా కూడా ప్రభుత్వం పేదల సొమ్ముతో రూ. 1200 కోట్లు ఖర్చు చేసి అధునాతన సౌకర్యాలతో కొత్త సెక్రటేరియట్ కడుతోందని క్యాప్షన్ ఇచ్చారు. ఇది నీరో, రోమన్ సామ్రాజ్యాన్ని గుర్తు చేస్తలేదా అని ప్రశ్నించారు.