రైస్ మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కయింది: RS ప్రవీణ్ కుమార్

రైస్ మిల్లర్లతో  ప్రభుత్వం కుమ్మక్కయింది: RS ప్రవీణ్ కుమార్

ధాన్యం కొనుగులో విషయంలో  రైస్ మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికీ కుమ్మక్కయిందని ఆరోపించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు మిల్లర్ల చేతిలో మోసపోయి, దళారులకు చౌకగా పంట అమ్ముకొని మోసపోతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పే బంగారు తెలంగాణలో రైతులకు చివరకు మిగిలింది ఇదేనా?  అంటూ ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 

కేసీఆర్ కు కాంట్రాక్టులు, కమీషన్లు తప్ప ప్రజా సమస్యలు రైతుల కష్టాలు ఏమాత్రం పట్టవని విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. యాసంగి వరి ధాన్యాన్ని కొనేదాక రైతుల పక్షాన బీఆర్ఎస్  ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు.  వరి కొనుగోలు కేంద్రాలలో రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వమే IKP కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 

గత కొన్ని రోజులుగా  రాష్ట్రంలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానా తిప్పలు  పడుతున్నారు. రోడ్డెక్కి ఆందోళనలు  చేస్తున్నారు. కొందరు తడిసిన ధాన్యం అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.