TSPSC కమీషన్ ను రద్దు చేయాలి...అప్పుడే అంతా సెట్ అయితది

TSPSC కమీషన్ ను రద్దు చేయాలి...అప్పుడే అంతా సెట్ అయితది

టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కావడంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రెండో సారి రద్దు కావడానికి సీఎం కేసీఆర్ నిరంకుశ కుటుంబ పాలనే కారణమన్నారు. టీఎస్పీఎస్సీ మొత్తాన్ని ప్రక్షాళన చేసి పరీక్షలు నిర్వహించి ఉంటే ఈ పరీస్థితి వచ్చేది కాదన్నారు. నిరుద్యోగుల అభ్యర్థనను మన్నించి వారి పక్షా నిలబడ్డ న్యాయవ్యవస్థకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి పలు డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 
 

Also Read :- మళ్లీ మళ్లీ రద్దు అయిన గ్రూప్ 1

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్లు..

  • టీఎస్పీఎస్సీ కమీషన్ సభ్యులంతా అర్జంటుగా రాజీనామా చేయాలి. (డా.జనార్దనరెడ్డి గారు, మీకు ఏ మాత్రం నైతిక విలువలున్నా స్వచ్ఛందంగా వైదొలగి పోలీసులకు నిజం చెప్పాల్సిందిగా కోరుతున్నా) 
  •  కమీషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త వారిని నియమించిన తరువాతనే మిగతా పరీక్షలను నిర్వహించాలి.
  •  కొత్తగా వచ్చిన 270 OMR షీట్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.
  •  SIT ఇన్వెస్టిగేషన్లో కమీషన్ ఛైర్మన్,సభ్యులు మరియు SO వెంకటలక్ష్మిలను నిందితులుగా చేర్చాలి.
  •  ఈ కేసును CBI కు అర్జంటుగా అప్పగించాలి. 
  •  అందరు అభ్యర్థులకు కనీసం లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి.
  •  నవంబర్లో జరగనున్న గ్రూప్-2 మరియు మిగతా పరీక్షలన్నీ కొత్త కమీషన్ హాయాంలోనే జరగాలి. ఈ కమీషన్ పై ప్రజలకు విశ్వాసం లేదు(ఒక్క KCR కుటుంబానికి తప్ప)
  • గ్రూప్ 1  కుంభకోణంలో తెలంగాణ సీఎంవో, మంత్రి కేటీఆర్ పాత్రను ఇప్పటికైనా వెలికి తీయాలి.  గత గ్రూప్-1 ప్రిలిమ్స్ టాపర్ ఎవరో ముఖ్యమంత్రే స్వయానా వెల్లడించాలి. 
  • పైవన్నీ జరగనిచో లక్షలాది నిరుద్యోగ బిడ్డలూ, వారి కుటుంబాలు తెలంగాణలో  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  తిరగనివ్వద్దని కోరుతున్నాను. 
  • నిరుద్యోగ మిత్రులారా, దయచేసి నిరాశ పడకండి- మన బహుజనరాజ్యంలో పారదర్శకంగా నిజాయితీగా పరీక్షలను నిర్వహించుకుందాం. ఇది నా హామీ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్లో డిమాండ్ చేశారు.