గల్ఫ్ బాధితుల కోసం ఇస్తానన్న రూ. 500 కోట్లు ఎక్కడ: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గల్ఫ్ బాధితుల కోసం ఇస్తానన్న రూ. 500 కోట్లు ఎక్కడ: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. గల్ఫ్ బాధితుల కోసం రూ. 500 కోట్లు కేటాయిస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. గల్ఫ్లో మృతి చెందిన కార్మికుడు భౌతికకాయం సొంతూరు జగిత్యాల జిల్లా ఖథలాపూర్కు చేరుకుంది. ఈ సందర్భంగా బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..కుటుంబ సభ్యులను ఓదార్చారు. 14 ఏండ్లుగా తండ్రిని చూసే అవకాశం లేకుండా పెరిగిన బిడ్డ..ఇవాళ విగతజీవుడిగా పడి ఉన్న తండ్రి చూస్తూ రోధిస్తున్న దృశ్యాలు కన్నీళ్లు తెప్పించక మానదని ఆవేదన వ్యక్తం చేశారు. 

హామీ ఏమైంది కేసీఆర్ జీ..

మరణించిన 27 రోజుల తరువాత సౌదీ నుండి ఖథలాపూర్ చేరిన గల్ఫ్ కార్నికుడి శవం. నిన్న వాళ్లింటికెళ్లిన. 14 సం.లు గా తండ్రిని చూసే అవకాశం లేకుండా పెరిగిన బిడ్డ. వాళ్ల పరిస్థితి ఎంతటి రాతి గుండెకైనా కన్నీళ్లు తెప్పించక మానదు. నాడు వీళ్ల కోసం ఇస్తానన్న ₹500 కోట్లు ఎక్కడ పోయినై #KCR ji? అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్లో ప్రశ్నించారు.