మరో పదేళ్లు కుటుంబపాలన సాగించాలనేదే కేసీఆర్ పన్నాగం

మరో పదేళ్లు కుటుంబపాలన సాగించాలనేదే కేసీఆర్ పన్నాగం

ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటి ధర్నాలు ఓ రాజకీయ డ్రామా అని బీఎస్పీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మరో పదేళ్లు కుటుంబపాలన సాగించాలనేది కేసీఆర్ పన్నాగమని ఆయన అన్నారు.

‘హుజూరాబాద్‎లో ఈటల ఓడిపోవాలని అనేక కుట్రలు చేసి.. ఘోర పరాజయం చవి చూసి, అతని విజయాన్ని తట్టుకోలేక, కేంద్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటి ధర్నాలు చేయడం ఓ రాజకీయ డ్రామా. ఇది కార్పొరేట్ శక్తులు పన్నిన వలలో అన్నదాతలను ఇరికించే ఘోరమైన కుట్ర. జాగో తెలంగాణ..

రోహిత్ వేముల బలవన్మరణం, మాతృభూమిలోనే మైనారిటీలను నిర్వాసితులను చేసే సీఏఏ చట్టం, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దుకు వ్యతిరేకంగా, ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఏనాడూ ధర్నా చేయని టీఆర్ఎస్.. నేడు రైతుల కోసం ధర్నా చేయడం హాస్యాస్పదం.

2016లో ఇందిరాపార్క్​ ధర్నాచౌక్ ఎత్తేసి, ప్రశ్నించే గొంతుకలను అణిచివేసి, రైతులకు బేడీలు వేసిన కేసీఆర్.. నేడు ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదే చౌక్ వద్ద ధర్నా చేయడం ఓ వింత. మరో పదేళ్లూ ప్రగతి భవన్‎లోనే తిష్టవేసి కుటుంబపాలన సాగించాలన్న పన్నాగం’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.