జవాన్లకే సాయమందలేదు.. రైతులకు అందుతుందా?

జవాన్లకే సాయమందలేదు.. రైతులకు అందుతుందా?

గల్వాన్ లోయ ఘటనలో అమరులైన జవాన్లకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయం ఇంకా అందలేదని బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తాజాగా కేసీఆర్ ఢిల్లీ నిరసనల్లో చనిపోయిన రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కాగా.. అప్పుడెప్పుడో జవాన్లకు ప్రకటించిన సాయమే ఇంకా అందలేదు.. మరి రైతులకు మొన్న ప్రకటించిన సాయం అందడానికి ఇంకా ఎన్ని యుగాలు పడుతుందో అని ఆయన ఎద్దేవా చేశారు.

‘గత జూన్ లో గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్లందరికీ తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి రూ. 10లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించి నేటికి 17 నెలలైతుంది. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తప్ప మిగతా 19 మందికి ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదు. వీరజవాన్లకే ఈ పరిస్థితి ఉంటే.. మరి ఇటీవలే ప్రకటించిన 700 మంది రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందడానికి ఇక ఎన్ని యుగాలు పడుతుందో…!’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.