లడఖ్ ప్రజలపై ఆరెస్సెస్, బీజేపీ దాడి.. ఈ మారణహోమాన్ని ఆపండి: రాహుల్ గాంధీ

లడఖ్ ప్రజలపై ఆరెస్సెస్, బీజేపీ దాడి.. ఈ మారణహోమాన్ని ఆపండి: రాహుల్ గాంధీ

లడఖ్ హింసపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ అల్లర్ల వెనుక బీజేపీ, ఆరెస్సెస్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. 

లడఖ్ ప్రజలు తమ గొంతు వినిపించాలనుకుందని.. తమకు సమాధానం చెప్పాలని ఆశించిందనీ.. కానీ బీజేపీ నలుగురి మృతికి కారణమైందని అన్నారు. అంతేకాకుండా సోనమ్ గాంగ్ చుక్ ను జైల్లో పెట్టారని విమర్శించారు. 

పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ శుక్రవారం (సెప్టెంబర్ 26) అరెస్టయిన విషయం తెలిసిందే. లడఖ్ కు ప్రత్యేక రాష్ట్రహోదా ఇవ్వాలని.. 6వ షెడ్యూల్ లో చేర్చాలని చేసిన నిరసన హింసకు దారి తీయడంతో ఆయనను అరెస్టు చేశారు.

లడఖ్ లోని అద్భుతమైన ప్రజలు, సంస్కృతి, సంప్రదాయాలు ఆరెస్సెస్, బీజేపీ దాడిలో ఉన్నాయి. లడఖ్ ప్రజలు తమ గొంతు వినిపించాలనుకున్నారు.. కానీ వాంగ్ చుక్ ను అరెస్ట్ చేయడంతో పాటు నలుగురిని చంపి బీజేపీ రిప్లై ఇచ్చింది. 

మారణ కాండ ఆపాలి.. హింసకు పులిస్టాప్ చెప్పాలి.. లడఖ్ ను 6వ షెడ్యూల్ లో చేర్చాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 

వాంగ్ చుక్ అరెస్టు తర్వాత కూడా రాహుల్ గాంధీ సైలెంట్ గా ఎందుకు ఉన్నారని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించిన తర్వాత.. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

అంతకు ముందు లడఖ్ హింసపై మళ్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. అక్కడ ఉన్న సిచువేషన్ ను హ్యాండిల్ చేయడంతో దారుణమైన విధానాలను కేంద్రం అవలంభిస్తుందని.. వాంగ్ చుక్ ను అరెస్టు చేస్తే సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. 

వెంటనే వాంగ్ చుక్ ను విడుదల చేసి.. ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. కాల్పులు జరిపి నలుగురి మృతికి కారణమైన పోలీసులపై జుడీషియల్ ఎంక్వైరీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.