ఫిట్ నెస్ లేని వాహనాలపై దాడులు

ఫిట్ నెస్ లేని వాహనాలపై దాడులు

హైద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు వాహనాల తనీఖీలు నిర్వహించారు. హిమాయత్ నగర్ లో ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు సంయుక్తంగా ఫిట్ నెస్ లేని వాహనాలపై దాడులు నిర్వహించారు. ఇప్పటివరకూ 20 బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఫిట్ నెస్ లేని వాహనాలకు నోటీసులు ఇచ్చారు. సరైన పత్రాలు లేని వాహనదారులపై కేసులు నమోదు చేశారు.

ఫిట్ నెస్, ఫస్ట్ ఎయిడ్, డ్రైవింగ్ లైసెన్స్ లను పరిశీలించారు. శంషాబాద్ లోనూ రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాఠశాల బస్సులపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు పాటించని మూడు బస్సులను సీజ్ చేశారు. సరైన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్ నెస్ లేకుండా తిరుగుతున్న స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆర్టీఏ అధికారులు…