హైదరాబాద్సిటీ, వెలుగు: ఆర్టీసీ నిర్వహిస్తున్న కార్గో సర్వీసు సెంటర్లో కస్టమర్లు క్లెయిమ్చేయని వస్తువులను మరోసారి వేలం వేస్తున్నట్టు ఆర్టీసీ అసిస్టెంట్మేనేజర్(లాజిస్టిక్స్) ఇషాక్బిన్ మహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత వినియోగ దారులకు వారి పార్శిళ్లుతీసుకెళ్లాల్సిందిగా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా వారు పార్శిల్ తీసుకెళ్లడం లేదన్నారు.
ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఆర్టీసీ ఆయా వస్తువులను జప్తు చేసి వేలం వేస్తుందని తెలిపారు. ఈ నెల19, 20వ తేదీల్లో సికింద్రాబాద్జేబీఎస్లోని కార్గో విభాగంలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం జరుగుతుందని తెలిపారు. మొత్తం 136 వస్తువులు వేలం వేయనున్నట్టు తెలిపారు.
