వానల టైమ్​లో బస్సులను జాగ్రత్తగా నడపాలి : ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

వానల టైమ్​లో బస్సులను జాగ్రత్తగా నడపాలి : ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
  •  డ్రైవర్లకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచన

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో బస్సులను జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని డ్రైవర్లకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. చెరువులు, కుంటలు నిండిన చోట, నదులు, కల్వర్టుల ప్రవాహం ఉన్న  చోట చూసి.. బస్సులను నడపాలని, సాహసాలు చేయవద్దని చెప్పారు. డ్యూటీ స్టార్ట్ అయ్యే ముందు బస్సు లైట్లు, వైపర్ కండీష
న్​ను పరిశీలించుకోవాలని తెలిపారు. హైదరాబాద్ సిటీలో, శివార్లలో మ్యాన్ హోల్స్ , రోడ్ల మీద నీళ్లు నిలిచినపుడు స్పీడ్​​గా వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.  

22 నుంచి శ్రీశైలానికి టూర్ ప్యాకేజ్

శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక టూర్‌‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇక నుంచి ప్రతి శనివారం జేబీఎస్‌‌ నుంచి శ్రీశైలానికి స్పెషల్ బస్సులను నడపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రెండ్రోజుల పాటు కొనసాగే టూర్‌‌.. ఈ నెల 22 నుంచి స్టార్ట్ కానుందని వెల్లడించింది. ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2,700, పిల్లలకు రూ.1,570గా ఆర్టీసీ ఖరారు చేసింది.   ఆర్టీసీ వెబ్ సైట్, బుకింగ్ కేంద్రాల్లో రిజర్వేషన్ చేసుకోవాలని ఎండీ సజ్జనార్ వెల్లడించారు.