గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

టీవీలో సమ్మె వార్తలు చూస్తూ కుప్పకూలిన గఫూర్

ఎల్లారెడ్డి, వెలుగు: మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ మహమ్మద్​ గఫూర్ (34) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. గోలిలింగాల గ్రామానికి చెందిన గఫూర్ నిజామాబాద్ డిపో 2లో ఐదేండ్లుగా డ్రైవర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తు న్నాడు. సమ్మె నేపథ్యంలో నిరసనల్లో పాల్గొంటున్నాడు. జీతం రాక ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి టీవీలో కార్మికుల సమ్మె వార్తలు చూస్తుండగా గుండెపోటు వచ్చింది. పరిస్థితి విషమించడంతో చికిత్స కోసం హైదరాబాద్‌‌‌‌ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గఫూర్​కు ఏడాదిన్నర క్రితం పెండ్లయ్యింది. భార్య, ఆరు నెలల చిన్నారి ఉన్నారు.

RTC driver Mohammed Ghafoor, died of a heart attack on Tuesday