మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

V6 Velugu Posted on Nov 13, 2019

మహబూబాబాద్  జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం  డ్రైవర్ ఆవుల నరేష్(45) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  వెంటనే అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ డ్రైవర్ నరేష్ మృతి చెందాడు. నరేష్ ది మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామం. గత 15 ఏళ్లుగా నరేష్ ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం మహబూబాబాద్ డిపోలో నరేష్  విధులు నిర్వహిస్తున్నాడు.

Tagged RTC, sucide, mahaboobabad, Naresh, driver

Latest Videos

Subscribe Now

More News