
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఎంప్లాయీస్‌కు సమ్మెకు ముందు రావాల్సిన శాలరీలను బుధవారం ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇటీవల సెప్టెంబర్15వ తేదీ వరకు మాత్రమే జీతాలిచ్చారు. సెప్టెంబర్16వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు.. అంటే సమ్మెకు ముందు రోజు వరకు పనిచేసిన18 రోజుల జీతాలు ఉద్యోగులకు ఇవ్వలేదు. ఆ శాలరీలను ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి మంగళవారమే పే స్లిప్‌లు ఇచ్చినట్లు సమాచారం.