కర్నాటక పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్‌‌ బస్సులు

కర్నాటక పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్‌‌ బస్సులు

కర్నాటక పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్‌‌ బస్సులు

గానుగాపూర్‌‌‌‌, పండరీపూర్‌‌‌‌, తుల్జాపూర్‌‌‌‌కు సర్వీసులు

హైదరాబాద్, వెలుగు : కర్నాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గానుగాపూర్‌‌ దత్తాత్రేయ స్వామి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సూపర్‌‌ లగ్జరీ బస్సును ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 16న సాయంత్రం 6 గంటలకు ఎంజీబీఎస్‌‌ నుంచి గానుగాపూర్‌‌కు బస్సు బయలుదేరుతుందని బుధవారం ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. 17న దత్తాత్రేయ స్వామి దర్శనం తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి, సాయంత్రం 4కు పండరీపూర్‌‌ చేరుకుంటుందని వెల్లడించింది. 

పాండురంగ స్వామి దర్శనం పూర్తయ్యాక రాత్రి 10 గంటలకు తుల్జాపూర్‌‌కు వెళ్లి, అక్కడ తుల్జా భవానీ మాత దర్శనం చేసుకొని, 18న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌‌కు బయలుదేరి, రాత్రి 8 గంటలకు ఎంజీబీఎస్‌‌కు చేరుకుంటుందని తెలిపింది. ఈ టూర్‌‌కు టికెట్‌‌ ధర రూ.2,500గా సంస్థ నిర్ణయించింది. దర్శనం, భోజన, వసతి సదుపాయాలు భక్తుల బాధ్యతేనని తెలిపింది. సంస్థ వెబ్‌‌సైట్‌‌ www.tsrtconline.inలో లేదా ఎంజీబీఎస్‌‌, జేబీఎస్‌‌, దిల్‌‌సుఖ్ నగర్ బస్ స్టేషన్లలోని కౌంటర్లలో టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.