బస్ టికెట్​తో  స్నాక్స్ బాక్స్

బస్ టికెట్​తో  స్నాక్స్ బాక్స్
  • ఇయ్యాల్టి నుంచి ఈ-గరుడ బస్సుల్లో అమలు


హైదరాబాద్, వెలుగు : దూర ప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్ల కోసం ఈ-గరుడు బస్సుల్లో బస్ టికెట్​తో పాటు స్నాక్స్ బాక్స్‌‌ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. పైలట్‌‌ ప్రాజెక్ట్‌‌గా హైదరాబాద్‌‌ - విజయవాడ మార్గంలో తిరిగే తొమ్మిది ఎలక్ట్రిక్‌‌  గరుడ బస్సుల్లో ఈ విధానాన్ని శనివారం నుంచి ప్రారంభిస్తున్నామని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్  ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రయాణికు ల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగతా సర్వీసులకు వర్తింపజేస్తామన్నారు. ఈ స్నాక్స్ బాక్స్‌‌లో మిల్లెట్స్​తో తయారు చేసిన ఖారా, చిక్కీ ప్యాకెట్లతో పాటు మౌత్‌‌ ప్రెష్నర్‌‌, టిష్యూ పేపర్ ఉంటాయని తెలిపారు. స్నాక్స్ బాక్స్‌‌ కోసం టికెట్  రేటులోనే రూ.30 వసూలు చేస్తామని చెప్పారు. స్నాక్స్ బాక్స్‌‌పై క్యూఆర్‌‌ కోడ్‌‌ ఉంటుందని, దానిని స్కాన్‌‌ చేసి ప్రయాణికులు తమ సూచనలు ఇవ్వవచ్చని సూచించారు.