ఎలక్ట్రిక్ బస్సులు గో బ్యాక్...మార్చ్ 30 నుంచి ఆర్టీసీ జేఏసీ పోరాటాలు

ఎలక్ట్రిక్ బస్సులు గో బ్యాక్...మార్చ్ 30  నుంచి ఆర్టీసీ జేఏసీ పోరాటాలు

హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకంగా తెలంగాణలో తమ పోరాటాలను ఉధృతం చేసేందుకు ఆర్టీసీ జేఏసీ దశల వారీ ఉద్యమాలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ‘‘ఎలక్ట్రిక్ బస్సులు గో బ్యాక్’’ పేరుతో ఈ నెల 30 న రాష్ట్రంలోని ఎలక్ట్రిక్ బస్సులు నడిచే డిపోల ముందు అర్థనగ్న ప్రదర్శన చేయనున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న శనివారం తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సంస్థ ఉద్యోగులకు, కార్మికులకు పిలుపునిచ్చారు.

ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో  ఆర్టీసీ డిపోలను క్రమేపీ ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే కుట్ర చేస్తోందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ బస్సులను ఆర్టీసీ సంస్థనే కొనుగోలు చేసి నడిపించాలని డిమాండ్ చేశారు.  డిపోల ముందు నిరసన అనంతరం  మరో కార్యక్రమం త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.