శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
  • శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రతి 20 నిమిషాలకో బస్సు

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులో శ్రీశైలం వెళ్లాలంటే ఎంజీబీఎస్ కు రావాల్సి ఉండేది. దీంతో హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైన అందించే ఉద్దేశంతో ఆర్టీసీ నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టు క్రాస్ రోడ్డు నుంచి బస్సులను నడపనుంది.

 అక్కడి నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో సిటీ జనానికి ముఖ్యంగా శ్రీశైలం రూట్​లో ఉండే సిటీ శివారు ప్రాంత ప్రజలకు ఆర్టీసీ చార్జీలు తగ్గడంతో పాటు సమయం కూడా కలిసి రానుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ. సజ్జనార్ సోమవారం ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. tgsrtcbus.in వెబ్ సైట్​లో కూడా తమ టికెట్లను రిజర్వ్  చేసుకోవచ్చని పేర్కొన్నారు. శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.