
- ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు మీటింగ్ లో ఎండీ సజ్జనార్ హామీ
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళా భవన్ లో రాష్ట్ర స్థాయి ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డు సభ్యులతో ఎండీ సజ్జనార్ సమావేశమయ్యారు.
సజ్జనార్ మాట్లాడుతూ.. 21 శాతం ఫిట్ మెంట్ తో 2017 పీఆర్సీ, 2013 ఆర్పీఎస్ బాండ్ల డబ్బుల విడుదలతో పాటు పెండింగ్ డీఏలను యాజమాన్యం మంజూరు చేసిందని చెప్పారు. 2,350 మందికి కారుణ్య నియామకాలు, మెడికల్ అన్‌ఫిట్ అయిన 537 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. పనిభారాన్ని తగ్గించేందుకు డ్రైవర్, కండక్టర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు.