
మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పెట్టాక ఆర్టీసీలో రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు ఎక్కుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ చూసినా బస్సులు ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఫ్రీ కదా అని తక్కువ దూరం వెళ్లే మహిళలు కూడా ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఎక్కువగా వెళ్తున్నారు. అయితే దీని వల్ల దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కల్గుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్లో వెల్లడించారు.
తక్కువ దూరం వెళ్లే మహిళలు ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కాకుండా పల్లె వెలుగు బస్సుల్లో వెళ్లాలని సూచించారు. తక్కువ దూరం వెళ్లే వాళ్లు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా ఎక్కడపడితే అక్కడ దారి మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు..దీని వల్ల ప్రయాణ సమయం పెరుగుతోందన్నారు. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపుతారని చెప్పారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి… pic.twitter.com/bJryVNNxkM
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 23, 2023